జిల్లాలో కొత్త మైనింగ్, క్వారీ లీజులకు పర్యావరణ అనుమతి తప్పనిసరి
డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను వెబ్ సైట్‌లో ఉంచిన కలెక్టర్
21లోపు అభిప్రాయాలు పంపాలని సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20
గురువారం:
జిల్లాలో కొత్తగా మైనింగ్, క్వారీ లీజులు మంజూరు చేయడం, అలాగే రెన్యువల్స్ కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అనుమతి తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ అనుమతులకు కీలకమైన జిల్లా సర్వే నివేదికను పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు సిద్ధం చేసి ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు. డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను జిల్లా అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చని, ఈ నివేదికపై అభిప్రాయాలు లేదా సూచనలు ఈ నెల 21లోపు జిల్లా మైనింగ్ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ సూచించారు.