*జిల్లా కేంద్రంలోని యోగ భగవాన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ*

*జిల్లా కేంద్రంలోని యోగ భగవాన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ*

 

పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని యోగ భవన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని చెట్లు నాటారు . ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగారాష్ట్ర స్థాయి యోగ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించిన రెడ్డి పెట్ తాండా జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి గంగావత్ సందీప్, స్పోర్ట్స్ కోటాలో బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం జరిగిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగ పరిషత్ అధ్యక్షులు గురూజీ రామ్ రెడ్డి , కార్యదర్శి రఘుకుమార్ సురేందర్ వెంకటేశం సిద్దా గౌడ్ ఎల్లయ్య రాజు హిమబిందు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment