*పర్యావరణ పరిరక్షణ- అందరి బాధ్యత*
*ప్లాస్టిక్ వాడకండి తగ్గిద్దాం -సామాజిక బాధ్యతను పెంపొందించుకుందాం*
*మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య*
*హుజురాబాద్ జూలై11 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు “పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత” అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాధ్యతగా పరిసరాలతో పాటు ఇంటిదగ్గర పరిశుభ్రతను పాటించాలని తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. అలాగే తడి, పొడి చెత్తను వేరుచేసి విధిగా గ్రామాలలో గాని లేదా మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ కార్మికులకు అప్పగించాలని తెలియజేశారు. తర్వాత పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ పరిసరాలతో పాటు పర్యావరణానికి హానిచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి తమ వంతుగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించడంతో పాటుగా సామాజిక బాధ్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు అనంతరం గతంలో జరిగిన స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ అభినందించడంతో పాటుగా సర్టిఫికెట్స్ అందజేసినారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ కే సమ్మయ్య తో పాటు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య మున్సిపల్ మేనేజర్ భూపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.