పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై స్పందించిన..ఎర్రబెల్లి దయాకర్ రావు 

*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

* *సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని కలిసి వారికి ధైర్యం చెప్పారు.*

* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:

ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ :-

శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే “పాడి కౌశిక్ రెడ్డి”

ని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య..!

సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా..

ఈ ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా కేటీర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి  ప్రశ్నిస్తున్నారు కాబట్టే వారి పై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

ఈ కాంగ్రెస్ పాలన వలన రాష్ట్రం దివాలా తీసి మొత్తం అవినీతిమయమైపోయింది.

స్థానిక ఎలక్షన్లు జరపకుండా గ్రామాలకు వచ్చే నిధులు ఆగిపోయాయి.

రుణమాఫీ సగం చేసి మొత్తం చేశామని మోసం చేస్తున్నారు.

*స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పి రైతుబంధువేసి ఏదో లబ్ది పొందడానికి రైతులను మోసం చేస్తున్నారు.*

స్థానిక ఎలక్షన్ల అని చెప్పి ఈ అరెస్టులో పర్వాన్ని కొనసాగించడం ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ మంచిది కాదు.

నీ హైకమండే నువ్వు ఫెయిల్ అయ్యావ్ అని అంటున్నారు.

నా ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నీలాంటి దరిద్ర పాలన ఎప్పుడూ చూడలేదు.

నాయకత్వం సరిగా లేకనే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.

గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు.

ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నాడు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు

అసమర్ధ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.

మాకు గౌరవ న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది. మాపై, మా నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదు.

ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలన పై, బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment