కాంగ్రెస్ గుండాయిజాన్ని పెంచి పోషిస్తుంది…ఎర్రబెల్లి సంపత్ రావు

*రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో పూర్తిగా విఫలమైంది*

*కాంగ్రెస్ గుండాయిజాన్ని పెంచి పోషిస్తుంది*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు*

*జమ్మికుంట జనవరి 8 ప్రశ్న ఆయుధం*

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకుంటారని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. నిన్న బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని సంపత్ రావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు పిరికిపందల చర్య అని, ఇలాంటి దాడులకు బిజెపి కార్యకర్తలు భయపడరని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డాడు.నిన్న బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి దానికి నిదర్శనమని ఎక్కడో ఎవరో ఏదో అన్నారని బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపవలసిన కాంగ్రెస్ నాయకులు రౌడీలు, గుండాల వలె ప్రవర్తించారని ఆయన ఆక్రోషించారు. ఇలాంటి దాడులు మరోసారి పునరావృత్తమైతే కాంగ్రెస్ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now