Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎర్రవల్లి డబుల్ బెడ్ రూమ్ బాధితులు

IMG 20241021 WA0273

గజ్వేల్ అక్టోబర్ 21 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామం లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 2022 లో గ్రామపంచాయతీ తీర్మానం తీర్మానం చేసి 45 మందికి అర్హులని కేటాయించడం జరిగింది. ఇందులో ఎడమ సురేష్, ఆవుల కాడి పరుశురాం గ్రామపంచాయతీ తీర్మానంలో వీరు పేర్లు ఉండగా ఇప్పటివరకు వీరికి ఇల్లు ముగ్గు పోయలేదు పలుమార్లు అధికారులను అడగగా రేపు మాపు అని చెప్పడంతో విసుకు చెంది సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో మాకు కేటాయించిన ఇల్లు నిర్మించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎడమ సురేష్, ఆవుల కాడి పరుశురాం లు తెలిపారు. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఈఈ తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేసిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version