మున్సిపల్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి 

మున్సిపల్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి

– తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా మున్సిపల్ వాటర్ వర్క్స్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశని సోమవారం నిర్వహించరు. ఈ సమావేశానికి తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనము 26000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం వాటర్ వర్క్స్, ఎలక్ట్రిషన్, కంప్యూటర్ ఆపరేటర్లు, శారటేషన్ కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రమాదవశత్తు చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పైన ఉన్నటువంటి అధికారుల వేధింపులు మానుకోవాలని ఆయన అన్నారు. కామారెడ్డి మున్సిపల్ లో కనీస వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం నిత్యవసర సరుకుల పెరుగుతున్న వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచడం లేదన్నారు. జీవో 60 ప్రకారం వేదానాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో కామారెడ్డి మున్సిపల్ కార్మికులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు విఎల్ నరసింహారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు, ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్, రైతు సంఘం నాయకులు దేవయ్య, కామారెడ్డి మున్సిపల్ నాయకులు ఎం లక్ష్మణ్, రాజిరెడ్డి, రాజు, ఏ రాజు, ఆర్ నర్సింగరావు, అయాజ్, లక్ష్మణ్, కిషన్, జుబేర్, సుదర్శన్, శంకర్, రవీందర్, నర్సింలు, సంగారెడ్డి రమేష్, రాములు, అంజయ్య, ఎల్లవ్వ, పద్మ, అంజమని లక్ష్మి, కృష్ణ, నీలం శ్రీనివాస్, విజయ్ కుమార్, శ్రీధర్, నరేష్, రాజా గౌడ్, నాగరాజు, ప్రకాష్ 150 మంది కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now