లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు: ఎస్సై అనిల్ కుమార్ దంపతులు 

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు: ఎస్సై అనిల్ కుమార్ దంపతులు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి :

ఆదివారం సందర్భముగా మాచారెడ్డి మండలంలోని చుక్క పూర్ గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, హైదరాబాద్ మొదలగు జిల్లాలలో నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా వాహన పూజలు, గండ దీపాలు, పుట్టు వెంట్రుకలు, ఒడిబియాలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ దంపతులు శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ సంతోష కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్న మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్.

Join WhatsApp

Join Now