సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై కరుణాకర్ రెడ్డి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై కరుణాకర్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గం, 12 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గౌరారం గ్రామంలో పర్యటించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అడ్డం పెట్టుకుని గొడవలు దిగవద్దని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ప్రజల రక్షణ మరియు సెన్సాఫ్ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.  గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, ఆన్లైన్ మోసాల బారిన ఎవరు కూడా పడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 సైబర్ సెల్ జాతీయ ప్లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. గ్రామంలో ఎవరు కూడా బెల్ట్ షాప్ నడపవద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించి నట్లయితే మరియు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని  సూచించారు.

Join WhatsApp

Join Now