Site icon PRASHNA AYUDHAM

హోటల్ వద్ద ఎస్సై – నిర్వాహకుల ఘర్షణ

IMG 20250823 WA0020

హోటల్ వద్ద ఎస్సై – నిర్వాహకుల ఘర్షణ

హన్మకొండ ఫోర్ట్ రోడ్డులో హోటల్ వద్ద ఎస్సై అల్లరి

వృద్ధురాలిపై చెంప చెళ్లుమనిపించడంతో ఉద్రిక్తత

ఆమె రివర్స్ ఇచ్చి రెండు పీకడం – ఘర్షణ ముదిరింది

కొడుకుపై దాడి చేయడంతో కుటుంబ సభ్యుల ప్రతిఘటన

“పెద్దలకి గులాంగిరి.. పేదలకి జులుం చేస్తే ఇలానే” అంటూ స్థానికుల విమర్శలు

వరంగల్ హన్మకొండ ఫోర్ట్ రోడ్డులో శుక్రవారం రాత్రి ఆసక్తికర ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో సమయం మించిపోయిందంటూ ఎస్సై అక్కడి సిలిండర్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇదే వివాదానికి దారితీసింది.

హోటల్ నిర్వాహకులు “మేము సమయం లోపలే మూసేశాం.. ఎందుకు జులుం చేస్తున్నావు?” అంటూ నిలదీశారు. ఆ సమయంలో ఎస్సై అకారణంగా అక్కడున్న వృద్ధురాలికి చెంప చెళ్లుమనిపించాడు. దాంతో ఆమె రివర్స్ అయ్యి రెండు పీకింది.

ఇంకా కోపంతో ఆమె కొడుకుపై దాడి చేసిన ఎస్సైకి, “నా కొడుకునే కొడతావా?” అంటూ వృద్ధురాలు మళ్లీ నాలుగు పీకింది. దీంతో అక్కడ గుమికూడిన ప్రజలు కూడా ఎస్సై ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. “పెద్దలకి గులాంగిరి.. పేదలకి జులుం చేస్తే ఇలానే అవుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.

Exit mobile version