హెచ్ఎంటి సూర్య నగర్ కాలనీలో నూతన అసోసియేషన్ ఏర్పాటు

హెచ్ఎంటి సూర్య నగర్ కాలనీలో నూతన అసోసియేషన్ ఏర్పాటు

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటి సూర్య నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారం లక్ష్యంగా సరికొత్త అసోసియేషన్ ఘనంగా ఏర్పాటైంది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి నిర్వహించిన సమావేశంలో కాలనీ భవిష్యత్తు ప్రగతిపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో విజయ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

నాయకుల ఎంపికలో ఏకగ్రీవంగా కింది సభ్యులను ఎన్నుకున్నారు:

* అధ్యక్షులు: రొండ్ల మహిపాల్ రెడ్డి

* ఉపాధ్యక్షులు: కుంచం కృష్ణ

* జనరల్ సెక్రటరీ: కోట రామి నాయుడు

* జాయింట్ సెక్రటరీ: పిట్టల రాజు

* ఖజాంచి (ట్రెజరర్): నోముల ఆంజనేయులు

* సభ్యులు: అనిల్ రాజ్, శశికాంత్ రెడ్డి, సోను అన్సారీ, ఆచారి, రఘు మాధవ రెడ్డి, జితేందర్, రామారావు

నూతన కార్యవర్గం నాగారం మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై కాలనీ సమస్యలపై అందరూ ఏకతాటిపై పోరాడి, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని స్థానికులు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment