కామారెడ్డిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు
ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించిన కలెక్టర్
ఆశిష్ సాంగ్వాన్
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపే లక్ష్యం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 23
కేంద్రంలోని పాత ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం కళాశాల పరిసరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. త్రాగునీరు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, శుభ్రత, మౌళిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అవగాహన పెంపు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి, ప్రిన్సిపల్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.