సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు – ప్రభుత్వానికి భారతీయ కిసాన్ సంఘం తరుపున కృతజ్ఞతలు

సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు – ప్రభుత్వానికి భారతీయ కిసాన్ సంఘం తరుపున కృతజ్ఞతలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం)అక్టోబర్28

పెద్ద కొడప్గల్ మండలంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ కిసాన్ సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

పెద్ద కొడప్గల్ మండల భారతీయ కిసాన్ సంఘం గ్రామ అధ్యక్షుడు కుమార్ సింగ్ మాట్లాడుతూ, “మండల అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితంగా, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో భారతీయ కిసాన్ సంఘం నిరంతర పోరాటం వలన ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని” అన్నారు.రైతులు దళారులకు అమ్మకాలు చేసి నష్టపోకుండా ప్రభుత్వ కేంద్రాలకే సోయా పంటను విక్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శి బోడి మల్లికార్జున్ యాదవ్,బాన్సువాడ డివిజన్ సంఘం సభ్యులు దేవి సింగ్, జక్కుల అంజిరం, జక్కుల శివురామ్, కర్తల్, జగదీష్, పేరడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment