ఉచితంగా గ్యాస్ సిలిండర్.. ఇలా అప్లై చేసుకోండి!
మోదీ ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ పథకం రెండో ఫేజ్ కింద ఇప్పటికే 2.34కోట్లమంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ వర్గాలకు చెందిన మహిళలై ఉండాలి.18సంవత్సరాల వయసు నిండటంతో పాటు మరో ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకొని దగ్గరలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించొచ్చు..