రంగారెడ్డి అర్బన్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈటెల రాజేందర్ , రవికుమార్ యాదవ్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 25: కూకట్పల్లి ప్రతినిధి
దిల్‍సుఖ్‍నగర్,బృందావన్ ప్రైడ్ బాంక్వెట్ హాల్ లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమ కార్యశాల లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు ఎస్సీ మోర్చ జాతీయ నాయకులు కుమార్ తో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం లో అత్యధికంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సిద్ధాంత పరమైన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మన భారతీయ జనతా పార్టీ లోనే ఉన్నందుకు మనం గర్వించాలన్నారు, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కనీసం 1000 మంది సభ్యులను సమోదు చేయించాలని దేశం మొత్తంలో మన తెలంగాణ నుండి అత్యధిక సభ్యులను నమోదు చేయించి అందరికీ ఆదర్శంగా నిలవాలని, సభ్యత్వ నమోదు కొరకు 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించాలని ఈ నంబర్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.