Site icon PRASHNA AYUDHAM

ఇథనల్ పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలి

*ఇథనల్ పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలి*

–సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్

మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయ్యపల్లి, పోతారం, నర్సింహులపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనల్ పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, పార్టీ కార్యవర్గ సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమను రద్దు చేసినట్లు, మన ప్రాంతంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలని, సీపీఎం పార్టీ మండల కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటీవల లగచర్లలో ఫార్మా కంపెనీ కొరకు సేకరించిన భూమి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, పరిశ్రమల అనుమతులు రద్దు కొరకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలతో, ఆయా గ్రామాల, మండల ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ఇథనల్ పరిశ్రమ రద్దుకు సహకరించాలని, సీపీఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version