ప్రత్యేక విమానంలో పాండాలు తరలింపు
చైనా జాతీయ సంపదగా భావించే పాండాలను అమెరికాకు బహుమతిగా పంపింది. దీంతో చైనాకు చెందిన రెండు పాండాలు ప్రత్యేక విమానంలో అమెరికాకు చేరుకున్నాయి. అమెరికాతో చైనా 1972లో చేసుకున్న ‘పాండా దౌత్యం’ ఒప్పందంలో భాగంగా తమ దేశంలోని బావో లీ, క్వింగ్ బావో పాండాలను చైనా ప్రభుత్వం అమెరికాకు పంపినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాండాలను వాషింగ్టన్‌లోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు.