పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ స
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.
దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ బదిలీ భర్త రాములు నా భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడు అని అతని యొక్క వృద్ధాప్య పెన్షన్ రద్దు చేయబడినదని వయోభారం వల్ల నాకు పక్షవాతం వచ్చినదని కావున నాకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కి ఎండార్స్ చేశారు.పాల్వంచ మండలం పిల్లవాగు గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన చిన్న సన్నకారు రైతులకు ఉన్నటువంటి భూమిలో వర్షం నీటి మీద ఆధారపడి పంటలు పండిస్తున్నామని, వర్షాలు లేకపోవడం వల్ల మా పొలంలో వేసిన పంటలు మొత్తం ఎండిపోవడం జరిగిందని మా యొక్క స్థితిగతులను పరిశీలించి మా పొలాల్లో వ్యవసాయ బోర్లు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఐటీడీఏ పీవో కి ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలం రామవరం 10వ వార్డు మరియు 6వ వార్డు మధ్యలో ఉన్న వాగు ( కుంట) యందు వ్యర్ధాల వలన గ్రామ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ అందులో నివసిస్తున్న విషపురుగులు, పాములు, దోమల వలన వచ్చే రోగాలతో అనేక రకములుగా ఇబ్బందులు పడుతున్నామని అట్టి కుంట నందు తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి అందులో అసాంఘిక కార్యక్రమాలు మరియు చీకటి సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కొత్తగూడెం మున్సిపాలిటీ వారికి ఆదేశాలు జారీ చేసి అట్టి కుంటను శుభ్రం చేసి గ్రామ ప్రజలకు దాని వలన వచ్చే రోగాల బారి నుండి కాపాడగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలం 36వ వార్డుకు చెందిన అజ్మీర సురేష్ తండ్రి కిషన్ నాకు ఎటువంటి ఉపాధి లేక రోజు కూలి పనులకు వెళ్తున్నానని ఏదైనా ఎస్టీకి సంబంధించిన స్కీం కింద స్వయం ఉపాధికి ముద్ర లోన్ ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.కొత్తగూడెం మండలం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సఫాయి బస్తీ నందు గల మా ఇండ్లపై నుండి విద్యుత్ శాఖ వారు 11 కె.విH.టీ లైన్ వేసి ఉన్నారని దీనివల్ల మాకు ఏ సమయంలోనైనా ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని మా ఇండ్లపై ఉన్నటువంటి 11 కె.వి. హెటీ లైను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండాస్ చేశారు.ఈ కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.