ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి పౌరుడు గౌరవించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు. మంగళవారం కోరుట్ల పట్టణంలో 75,వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుట్ల సిఐ సురేష్ బాబుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి విద్యాలయంలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చెర్పించాలని చిన్న నాటి నుండే పిల్లలకు రాజ్యాంగం పట్ల అవగాహన పెరిగి దాని విలువలతో పాటు సమాంతర సౌరబాలు వెల్లువిరుస్తాయని, తమకై పొందుపర్చిన హక్కులు తెలుస్తాయన్నారు. హమారా సంవిదాన్ హమారా స్వాభిమాన్ పెరిట భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాలు చేయడం అభినందనీయమని పేట భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర నాయకులు వుయ్యాల నర్సయ్య, బలిజ రాజరెడ్డి, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, డివిజన్ అధ్యక్షులు వుయ్యాల శోభన్, పట్టణ అధ్యక్షులు శనిగారపు రాజేష్, నాయకులు చిట్యాల లచ్చయ్య, పసుల కృష్ణ ప్రసాద్, బలవంతుల సురేష్, మోర్తాడ్ రాజశేఖర్, ఎస్.మహేష్, అల్లం రాజమౌళి, భూపెల్లి నగేష్, కండ్లె సురేష్ తదితరులు పాల్గొన్నారు.