అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇల్లు మంజూరు చేస్తా

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 26

దమ్మపేట మండల కేంద్రంలోని
ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ శంకుస్థాపన చేసిన
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్.కె. దస్తగీర్ అర్హులైన జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కింద క్లబ్బులో ఉన్న 17 మంది జర్నలిస్టులకు గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఎలాంటి జీతభత్యాలు లేకుండా, అహర్నిశలు ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానకర్తలుగా సేవలందిస్తున్న జర్నలిస్టులు అడిగినట్లుగానే గృహాలు మంజూరు చేస్తాం. ఎటువంటి నమూనా లేకుండా మీకు ఇష్టమైన రీతిలో ఇల్లు నిర్మించుకోండి. 4 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల రూపాయల ఇల్లు నిర్మించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని. సంక్రాంతి ఒకరోజు ముందు లేక వెనక గృహంలేని పేదవారికల నెరవేరుస్తామని సభ పూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment