ప్రతి రైతు ధాన్యాన్ని సేకరిస్తాం
తూకం అయ్యిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం
సరంపల్లి గ్రామంలో వరి కొనుగోలు సెంటర్ ని ప్రారంభించిన సొసైటీ డైరెక్టర్ బక్కన్నగారి రాజు
సరంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ డైరెక్టర్ బక్కన్నగారి రాజు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తూకం అయ్యిన వారం రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు పడేలా చేస్తాం అని అన్నారు రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా ధాన్యన్ని కొనుగోలు చేస్తామని అన్నారు రైతులకు అవసరం ఉన్న దగ్గర సెంటర్ ని ప్రారంభించాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రూప రవికుమార్, మాజీ సర్పంచ్ ముల్క రాజు బాలరాజ్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.