ప్రతి రైతుకు రుణమాఫీరావాలి

ప్రతి రైతుకు లక్ష రుణమాఫీ జరగాలి

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు డిమాండ్

ప్రశ్న ఆయుధం 24 జూలై(బాన్సువాడ ప్రతినిధి)

లక్ష లోపు రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరగాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం లక్ష లోపు రుణమాఫీ చేసినామని సంబరాలు మరియు పాలాభిషేకం చేస్తున్నప్పటికీ కేవలం 25 శాతం మంది రైతులకు మాత్రమే లక్ష లోపు రుణమాఫీ జరిగిందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల పైచిలుకు రైతులు లక్షలోపు రుణం తీసుకున్న వారు ఉంటే కేవలం 11,50,000 మందికి రుణమాఫీ జరిగింది మిగిలిన రైతుకు రుణమాఫీ జరగలేదు వీరికి రుణమాఫీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.దీని విషయంలో బ్యాంకర్లు గాని,వ్యవసాయ అధికారులు గానీ స్పష్టత ఇవ్వడం లేదని మండి పడ్డారు.మిగిలిన రైతులకు కూడా మరణమాఫీ జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఎలక్షన్ సమయంలో ఎటువంటి నిబంధన లేకుండా మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ విధంగా నిబంధనలు పెట్టడం రైతులను మోసగించడమే అదేవిధంగా రుణమాఫీ జరిగిన రైతులకు కూడా అకౌంట్ లో డబ్బులు సరిగా పడడం లేదు.మిత్తి చెల్లిస్తేనే మాఫీ జరుగుతుంది దీని విషయంలో ప్రభుత్వం తమకేది పట్టనట్టుగా వ్యవహరించడం సరికాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల నుండి లక్ష లోపు ఉన్న రైతుల పూర్తి జాబితాను తీసుకొని అందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now