ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
* గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలను చేరుకోవాలని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజీవ్ రహదారి పాతూరు మార్కెట్ వద్ద వాహనదారులకు ఆటో డ్రైవర్ లకు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఆదేశాల మేరకు, జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా వాహనదారులకు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ వెంకట్రామిరెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.