వాహనం నడిపే ప్రతి వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి

వాహనం నడిపే ప్రతి వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి

* గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి

*గజ్వేల్ , జనవరి 16,

వాహనం నడిపే ప్రతి వాహనదారులు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి సిబ్బందితో కలిసి గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రోడ్డు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనంకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళితోపాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now