ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనంలో భాగస్వాములు కావాలి*
*జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు అన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని 21వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని గురువారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు రోడ్లు శుభ్రపరచుట దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ నీళ్లు నిలువ ఉన్నచోట వేయడం అంగన్వాడి సెంటర్ ను సందర్శించడం ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం వ్యక్తిగత పరిశుభ్రత సీజన్ వ్యాధులు రాకుండా ఉండడం కోసం అవగాహన కల్పించడం పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.