*ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనంలో భాగస్వాములు కావాలి*
*జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 5*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భాగస్వాములు కావాలని జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి అన్నారు.జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల19వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి ఆధ్వర్యంలో నిర్వహించారు సోమవారం నుండి ఐదు రోజుల వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం రోడ్లు శుభ్రపరచుట దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ నీళ్లు నిలున్నకాడ వేయడం అంగన్వాడి సెంటర్ ను సందర్శించడం ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం వ్యక్తిగత పరిశుభ్రత సీజన్ వ్యాధులు రాకుండా ఉండడం కోసం అవగాహన కల్పించడం పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ శ్రీకాంత్ 19 వ వార్డు ఆర్పీలు జేరిపోతుల సృజన ఎండి భాను అంగన్వాడి టీచర్ రమ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మున్సిపల్ జవాన్ కిరణ్ మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
*వార్డులు స్వచ్ఛదనం పచ్చదనంతో కళకళలాడాలి…
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు స్వచ్ఛదనం పచ్చదనంతో కళకళలాడాలని మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ అన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు 21వ వార్డులలో మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.