రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 28, కామారెడ్డి :

రేబిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రెబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రేబిస్ ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడగాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు, యువతకు, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి రాజేశ్వర్, జిల్లా గ్రామీాభివృద్ధి అధికారి సురేందర్, సి. పి. ఒ. రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now