రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

ఓసి-2 లో మూల్ చంద్ సంతాప సభ లో గని మేనేజర్ కే సురేష్ కుమార్ రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరు పాటుపడాలని మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్ -2 గని మేనేజర్ కె సురేష్ కుమార్ అన్నారు. ప్రమాదవశాత్తు గురువారం నాడు ఓసి-2 లో జరిగిన డంపర్ పల్టీ ప్రమాదంలో మృతి చెందిన మూల్ చంద్ సంతాప సభ శనివారం ఓసి-2 నూతన కార్యాలయ ప్రాంగణంలో సెకండ్ షిఫ్ట్ రిలే సి లో జరిగినది. షిఫ్ట్ ఇన్ చార్జ్ భూక్యా భాoగ్యా అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. డంపర్ పల్టీ కొట్టడం ఆపరేటర్ మూల్ చంద్ తలకు బలమైన గాయమై ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్ట సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి ప్రమాదాల సంఘటనల అనుభవాల నేపథ్యంలో ప్రమాదాలు పునరావతం కాకుండా ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని కోరారు. యంత్రో రక్షతి రక్షితః యంత్రాన్ని మనం రక్షించుకుంటే యంత్రం మనల్ని రక్షిస్తుందని ఆయన అన్నారు. ఎన్ని కోట్లు వెచ్చించినా కూడా ఇంటి యజమానిని కోల్పోతే తిరిగి రారని అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే మూల్ చంద్ చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయాం అన్న భావన కలిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మూల్ చంద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు సింగరేణి సంస్థ అన్ని విధాలుగా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సామూహిక రక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మేనేజర్ కళ్యాణ్ రామ్,షిఫ్ట్ ఇన్ చార్జ్ డిప్యూటీ మేనేజర్ భూక్య బాoగ్యా, నాగేంద్ర కుమార్,అధికారులు భూక్య రాందాస్, బుడ్డి బాబ్జి,భరత్ చంద్ర, ఇంజనీర్ శంకర్, సూపర్వైజర్లు దేవేష్, సుకుమార్, దీక్షిత్, మెకానికల్ ఫోర్ మెన్ రామకృష్ణ, గుర్తింపు సంఘం నాయకులు శనిగరపు కుమారస్వామి, ప్రాతినిధ్య సంఘం నాయకులు కె అనిల్ , సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా బీవీఎస్ మూర్తి, పెద్ద ఎత్తున ఆపరేటర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now