*ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలి*
మహబూబాబాద్,జనవరి 9
రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ పట్టణంలోని జే ఎన్ టీ యూ కాలేజ్ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ భద్రత ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై జిల్లా రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించడం, జీబ్రా క్రాసింగ్ లను వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ అనుసరించడం, వాహనాలను ఓవర్టేక్ చేయకుండ ఉండడం, రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కాగా పాటించవలసిన అంశాలు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక దూరం ప్రయాణించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, శీతాకాలం వర్షాకాలంలలో రోడ్డుపై ప్రయాణించే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై పిల్లలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, తేదీ జనవరి 1 నుండి 31, వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎం.సాయి చరణ్, వెంకట్ రెడ్డి, అన్నారు.