ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి..
* గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
*గజ్వేల్ , జనవరి 05, (ప్రశ్న ఆయుధం ):*
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ సిబ్బందితో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం వల్లనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. నిత్యం ఎంతో మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ప్రమాదాలలో జరగడానికి కారణం అవుతున్నారని, కొందరు వారి విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు అని అందరూ క్షేమంగా వారి గమ్యస్థానాలను చేరవచ్చని సూచించారు.