Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ రైజింగ్ – 2047″ సర్వేలో అందరూ పాల్గొనాలి

IMG 20251021 204611

“తెలంగాణ రైజింగ్ – 2047” సర్వేలో అందరూ పాల్గొనాలి

రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు పౌరుల సూచనలు అవసరం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజలను “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా ప్రజల సూచనలు కీలకమని తెలిపారు. ఇప్పటివరకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, ఈ సర్వే ఈనెల 25తో ముగుస్తుందని చెప్పారు. భారత స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు నిండనున్న 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ప్రతి పౌరుడు www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌ ద్వారా తమ సలహాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version