పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి. 

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి.  

డివిజన్ ఫారెస్టు రేంజ్ అధికారి రామకృష్ణ..

IMG 20240822 WA00781 1

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క చనిపోకుండా కాపాడాలని కామారెడ్డి డివిజన్ ఫారెస్టు రేంజ్ అధికారి రామకృష్ణ కోరారు. ఆయన గురువారం టేక్రియాల జిల్లా పాఠశాలలో ‌విద్యార్థులతోకలిసి మొక్కలు నాటారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరు తన తల్లి పేరిట ఒక మొక్క నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ” ఏక్ పేడ్ మాకే నామ్ ” కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటినట్టు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ చెట్లను నరికేయడం వల్ల, చెట్లు తగ్గి పోవడంతో కాలుష్య వాతావరణం ఏర్పడుతుందని, ఎండాకాలంలో ఉష్ణో గ్రతలు అధికమైయ్యాయని, వర్షాకాలంలో తగినన్ని వర్షాలు కురవడం లేదన్నారు. అధిక వర్షాలు కురిసెందుకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెంజి అధికారి రమేష్.పారెస్ట్ సిబ్బంది హిరణ్మయి .నర్సులు పాల్గోన్నారు..

Join WhatsApp

Join Now