ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి
మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు
ప్రశ్న ఆయుధం 02 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి)
రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు.బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. బాన్స్వాడ మున్సిపాలిటీ సమీపంలో ఎండిపోయిన బోర్ వద్ద బోర్ చుట్టూ ఇంకుడు గుంతను ఏర్పాటు పనులను మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున రెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు ఎంత అవసరమని ఆయన అన్నారు.రోజు రోజుకి నీటి అవసరాలు పెరుగుతున్నాడంతో ప్రజలు బోరు మోటర్ల పై ఆధారపడుతున్నారని ఈ బోరు మోటర్ రీఛార్జి కావాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి,తుల శ్రీనివాస్,విట్టల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.