Site icon PRASHNA AYUDHAM

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

IMG 20250206 WA0328

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
తెలంగాణ స్టేట్  జర్నలిస్ట్స్ యూనియన్(టీఎస్ జేయు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం త్వరలో చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను బుధవారం తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు.
జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్ యు జె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర నాయకులు లింగబత్తిని కృష్ణ, ముత్యం ముఖేష్ గౌడ్, వెల్తూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version