భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణం లోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ నిద్రవ్యవస్థలోకి జారుకుంటోంది,కొందరు అధికారుల పర్యవేక్షణ స్నేహంగా మారడంతో అదే అదునుగా భావించి టౌన్ లోని కొందరు అంగన్వాడీ టీచర్లు తాము ఆడిందే ఆటగా పాడిందే పాట అనే చందంగా అంగన్వాడీ వ్యవస్థ స్థానిక పేట పట్టణంలో నత్తనడక నడుస్తోంది,ప్రస్తుతం దసరా నవరాత్రులు సందర్బంగా ఉదయం తొమ్మిది గంటలనుంది మధ్యాహ్నం రెండు గంటలవరకు అంగన్వాడీ కేంద్రాలు నడిపే వేసులు బాటు సంబంధిత శాఖ కల్పించింది,అయినా సరే కొందరు టీచర్లకు సెలవలు సరిపోకపోవడంతో ఉదయం పది గంటలకైనా అంగన్వాడీ కేంద్రాలకు రాలేని పరిస్థితులతో అశ్వారావుపేట టౌన్ లో కొందరు అంగన్వాడీ టీచర్లు ఉన్నారని గ్రామస్థులు తెలియ జేశారు,కనీసం అంగన్వాడీ కేంద్రాలు ఒక్క పూట నడపలేని స్థితిలో అంగన్వాడీ టీచర్లు దర్శనమిస్తున్నారు,అశ్వారావుపేట టౌన్ పరిధిలోని కన్యక పరమేశ్వరి వీధి కేంద్రం, సెంటర్ను క్లబ్ చేసి వడ్డెర బజార్ ప్రభుత్వ పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు ,కాగా మంగళవారం పది గంటల కావస్తున్నా అంగన్వాడీ కెద్రాలకు టీచరు రాకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,ఇక్కడి అంగన్వాడీ నిర్వహణపై అనేక ఆరోపణలు పత్రిక ముఖంగా గ్రామస్థులు తెలియ జేస్తున్నారు,ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే అడిగే వారిపై విమర్శలు గుప్పించడం తప్ప తమ పని తాము చేసికోలేని స్థితికి అంగన్వాడీ వ్యవస్థ అశ్వారావుపేట టౌన్ లో ఉంటోందని, తమ పని తాము చేసుకోలేని స్థితికి అంగన్వాడీ టీచర్లు వున్నారని సమాచారం,ఇప్పటికైనా మరుగున పడుతున్న అంగన్వాడీ విద్య వ్యవస్థను కాపాడాలని ఉన్నతాధికారులు పర్యావేక్షణతోనే అంగన్వాడీ వ్యవస్థ గాడిలో పడుతుందని గ్రామస్థులు తెలియజేశారు.