మందకృష్ణ మాదిగ చెప్పేవన్నీ అబద్ధాలే

*మందకృష్ణ మాదిగ చెప్పేవన్నీ అబద్ధాలే*

*మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకో?*

*మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి*

జమ్మికుంట నవంబర్ 28 ప్రశ్న ఆయుధం

మందకృష్ణ మాదిగ మీద ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షునిగా నియమించాలని,గడ్డం వివేక్ వెంకటస్వామి పైన దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలని,హలో మాల చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన డిసెంబర్ 1న జరిగే మహాసభ ను విజయవంతం చేయాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి అన్నారు. గురువారం జమ్మికుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి మాదాస్ మహేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం భావ్యం కాదన్నారు వర్గీకరణ మనువాదుల కుట్ర రిజర్వేషన్లను తొలగించే కుట్ర దగా చేస్తుందని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగను పావుగ వాడుకుని దళితుల మధ్య చిచ్చు 30 సంవత్సరాల నుండి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని మాలలు మొదటి నుండి సపోర్ట్ చేశారని దానికి బదులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంజీవయ్యను ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ జతీయ అధ్యక్షుడుగా ఖర్గే కు అవకాశం ఇచ్చారన్నారు. మాదిగల పైన బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే లక్ష కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.

 

మాలల వాదాన్ని రాజ్యాంగాన్ని బ్రతికించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మాలల జనాభా తక్కువ ఉందని దుష్ప్రచారం చేయడం భావ్యం కాద న్నారు. మందకృష్ణ మాదిగ చెప్పేది అన్నీ అబద్ధాలే అన్నారు. మాలల పై ఏడ్వడం కంటే 15 శాతము నుండి 30 శాతంకు పెరిగామన్నారు. 30 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుదామని అన్నారు. మనువాద బిజెపి పార్టీ మనువాద కుట్రను వీడనాడి రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడని, ఆ ప్రకారం పరిపాలన ఉండాలన్నారు. రాష్టం లోని గ్రామాల, పట్టణాల నుండి మాలలు, ప్రజలు, మహిళలు, యువకులు, విద్యార్థులు ఉపకులాలు అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలని డాక్టర్ పసుల రాంమూర్తి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేదరి నరేందర్, జిల్లా కార్యదర్శి భోగం చిరంజీవి, కాశమల్లే రమేష్, మండల అధ్యక్షులు బిట్ల మోహన్ నాయకులు నరసయ్య, బిట్ల చంద్రమౌళి, భోగం రాజు చిన్న,బొగం రాజు పోతుల కిషోర్, తోకల పవన్, రౌతు విగ్నేష్, రౌతు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment