ఆధునిక మనుస్మృతి ఐన ఇ.వి.ఎం దహనం

*ఆధునిక మనుస్మృతి ఐన ఇ.వి.ఎం దహనం*

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25:

మెట్పల్లి వందల ఏండ్ల నుంచి ఈ దేశంలోని బహుసంఖ్యాక ప్రజల్ని విద్య ఆస్తి ఆయుధం నుంచి దూరంగా ఉంచడమే కాకుండా తమ మూలవాసులైన బీసీ ఎస్సీ ఎస్టీ సమస్త స్త్రీజాతిని శాశ్వత గులాములుగా తయారు చేసిన “ఆర్యుల మనుస్మృతి” యే మూలకారణం. అట్టి దానిని అంబేడ్కర్ దహనం చేసి దేశ ప్రజలకు అన్ని రకాల స్వేచ్చ స్వతంత్రం మానవీయ హక్కులు అందజేసిన మహాముక్తి గ్రంథమే “నేటి భారత రాజ్యాంగం” అంటూ తెలంగాణ లింక్ ఎడిటర్ బద్ది హేమంత్ కుమార్ వెల్లడించారు. నేడు దేశ బహుజనులను తమ ఓటు వేసే హక్కును హరించడమే కాకుండా రాజ్యాధికారానికి దూరంగా ఉంచుతున్న “ఆధునిక మనుస్మృతియే ఇ.వి.ఎం మెషిన్” అంటూ ఐతే దీనిని తమ జాతీయ అధ్యక్షులు వామన్ మేష్రాం గారు ఎప్పుడో తేల్చిచెప్పారని, దానిని తగులబెట్టడమే ప్రజాస్వామ్య రక్షణ అంటూ భారతీయ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దయ్య రఘువీర్ పేర్కొన్నారు. మరోనేత బత్తుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఇటీవల అమిత్ షా చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన తన పదవి నుంచి తొలగాలని డిమాండ్ చేశారు. బి.వై.ఎం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జగిత్యాల మెట్పల్లి సిటీలోని ఇందిరా నగర్లో ఫూలే విగ్రహం సాక్షిగా ఆధునిక “మనుస్మృతిఐన ఇ.వి.ఎం మెషిన్ ప్లే కార్డుల దహన” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బర్ల అంజయ్య, అసతి శివకుమార్, సోమిడి జైరాం, దయ్య సిద్ధార్థ్, దయ్య రఘువీర్, మధ్యల లక్పతి, నీరటి నరేందర్, జర్నలిస్ట్ మామిడి రాజు, జర్నలిస్ట్ సామ్రాట్ అశోక్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now