తిరుమల
లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో స్నానం చేసి, మాఢవీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. ఆ తర్వాత భూమన ప్రమాణం చేస్తుండగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులిచ్చారు. దీంతో ప్రమాణం చేయకుండానే భూమన.. తిరుమల నుంచి వెళ్లిపోయారు.
Post Views: 3