Site icon PRASHNA AYUDHAM

లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్‌

తిరుమల లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో స్నానం చేసి, మాఢవీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం  అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. ఆ తర్వాత భూమన ప్రమాణం చేస్తుండగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులిచ్చారు. దీంతో ప్రమాణం చేయకుండానే భూమన.. తిరుమల నుంచి వెళ్లిపోయారు.

Exit mobile version