*విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ సర్టిఫికెట్స్ భద్రపరచుకునే కవర్లని ఇచ్చిన శిరీష ఆకినపల్లి..*
*జమ్మికుంట మార్చి 3 ప్రశ్న ఆయుధం*
సోమవారం రోజున జమ్మికుంట ఇల్లందకుంట మండలాలలోని కస్తూరిబా గాంధీ, మోడల్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ సర్టిఫికెట్ భద్రపరుచుకునే కవర్లను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆకిని పెళ్లి శిరీష విద్యార్థులకు అందజేశారు ఈనెల 5వ తారీకు నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకి పిల్లలందరూ శ్రద్ధగా చదివి మంచిగా రాయాలని విద్య యొక్క గొప్పతనాన్ని తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలకి వివరిస్తూ మనమందరం గొప్పగా బ్రతకాలంటే రేపు మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు