*గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రుల పరిశీలన*
*సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు*
*జమ్మికుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం:*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న లలిత డెంటల్, బిట్లాస్ డెంటల్, మమత డెంటల్, పి ఆర్ కె డెంటల్, దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను శుక్రవారం డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పత్రాలను వార్డులను పేషెంట్స్ కు అందిస్తున్న సేవలు వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేషెంట్స్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకూడదని ప్రభుత్వ నిబంధనలకు లోబడి వైద్యం అందించాలని కోరారు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రులు నడిపించిన, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిoచిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ ఆస్పత్రి యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.