శ్రీరామ్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలన
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1
నాగారం మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాఘవేంద్రరావు, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మద్దిరెడ్డి రాజిరెడ్డి, మామిడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను నేరుగా నాయకులకు తెలియజేసిన స్థానికులకు తక్షణ పరిష్కారం చూపుతామని నేతలు భరోసా ఇచ్చారు.