మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జమ్మికుంట ఆగస్టు 2 ప్రశ్న ఆయుధం
నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్థాయిలో జమ్మికుంట మున్సిపాలిటీ ముందడుగు వేస్తున్నదని అందులో భాగంగానే 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ& పీజీ కళాశాల పక్కన మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అయిదు జిమ్ములను మరమత్తులకు మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు ఆమోదించినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాకర్స్ కు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అయిదు జిమ్ములకు టెండర్లు పిలిచి, వాటి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు నరేష్, వికాస్,ఈ ఈ శ్రీకాంత్ లతో పాటు పాల్గొన్నారు.