భీమ్గల్ డిగ్రీ కళాశాల వెలుపల ఎక్సైజ్ దాడులు128గ్రామం ల గంజాయి స్వాధీనం 

భీమ్గల్ డిగ్రీ కళాశాల వెలుపల ఎక్సైజ్ దాడులు128గ్రామం ల గంజాయి స్వాధీనం

128 గ్రాముల పొడి గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం

కారేపల్లి గ్రామానికి చెందిన బుక్యా రఘు అరెస్ట్

మైనర్ పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్

ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణు మాధవ్ రావు నేతృత్వంలో ఆపరేషన్

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం), సెప్టెంబర్ 3:

భీమ్గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసరాల్లో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ భీమ్గల్ టీమ్ 128 గ్రాముల పొడి గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది.

పొడి గంజాయి విక్రయిస్తున్న భీమ్గల్ మండలం కారేపల్లి గ్రామానికి చెందిన బుక్యా రఘును అరెస్టు చేశారు. అదే సమయంలో గంజాయి వ్యసనానికి బానిసైన ముగ్గురు మైనర్ పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. వేణు మాధవ్ రావు, సబ్‌ఇన్స్పెక్టర్ కె. గోవర్ధన్, కానిస్టేబుళ్లు దత్తాద్రి, మహేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment