Site icon PRASHNA AYUDHAM

ఎస్‌హెచ్‌వో దిలీప్‌పై విచారణకు ఎక్సైజ్‌ డీసీ ఆదేశం..

ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో దిలీప్‌పై విచారణకు ఎక్సైజ్‌ డీసీ ఆదేశం

నిజామాబాద్ నగర ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో దిలీప్‌ పై విచారణ చేపట్టాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సోమిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌హెచ్‌వోపై ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ మల్లారెడ్డిని విచారణ చేపేట్టాలని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డిపో విచారణలో ఆలస్యంతోపాటు ఎస్‌హెచ్‌వోపై అరోపణలపై విచారించాలని ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ పూర్తి చేసి ఏడు రోజులలో నివేదికను అందించాలని ఎక్సైజ్‌ ఈఎస్‌కు ఆదేశించారు. ఎస్‌హెచ్‌వోపై నగరం నుంచి రాష్ట్ర ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు వెళ్లినట్లు తెలిసింది.

Exit mobile version