జిల్లా ప్రజలకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సంక్రాంతి శుభాకాంక్షలు..
నిజామాబాద్ జనవరి 13
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని ఆకాంక్షించారు. శాంతియుత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగని జరుపుకోవాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.