ఏడు కోట్ల, 98 లక్షల విలువగల మత్తుపదర్థాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ , ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని వివిధ స్టేషన్స్ లో ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం నమోదైన (71) కేసుల్లో నిషేదిత మత్తు పదార్ధాలు అయినటువంటి గంజాయి, ఆల్ఫాజోలం, డైజోఫామ్, గంజాయి మొక్కలు జక్రాన్ పల్లి మండలం పడక్కల్ గ్రామంలో గల మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు తెలిపారు.