ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 28 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఆంధ్రప్రదేశ్ నుంచి పూణేకు తరలి వెళ్తున్న గంజాయి రూ,,53 లక్షల విలువచేసే గంజాయి పట్టివేత
భద్రాచలం ట్రో ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద
ఎక్సైజ్ అధికారులు కాపుగాసి పట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు 210 కేజీల గంజాయిని కారులో తరలిస్తూ ఉండగా భద్రాచలం
వద్ద భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీం ఉన్నిసా బేగం సిబ్బంది కలిసి గురువారం పట్టుకున్నారు.పట్టుకున్న 210 కేజీల గంజాయి విలువ రూ,, 53 లక్షలు ఉంటుందనీ తెలియజేశారు.
గంజాయితోపాటు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని పట్టుకున్న భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను సీఐ రహీం ఉన్నిసా బేగం, ఎస్సై అల్లూరి సీతారామరాజు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ అభినందించారు.
భద్రాచలం ఆర్టిఓ చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
by Naddi Sai
Published On: November 28, 2024 9:38 pm