Site icon PRASHNA AYUDHAM

రు 2.90 కోట్ల విలువ గల గంజాయి కాల్చివేత ఎక్సైజ్ పోలీసులు

IMG 20241111 WA01771

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌లోని 1160 కేజీలగంజాయి దగ్ధం చేశారు.రూ.2.90 కోట్ల విలువ చేసే గంజాయిని సోమవారం కాల్చివేయించామని ఖమ్మం జిల్లా డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు.భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 35 కేసుల్లో పట్టుబడిన గంజాయిని కాల్చివేతకు డిస్పోజల్‌ అధికారిగా డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి అదేశాలు ఇచ్చారు.
భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 35 కేసుల్లో పట్టుబడిన 1160 కేజీల గంజాయిని ఏడబ్ల్యుఎం కన్సటింగ్‌ లిమిటెడ్‌ తల్లేడ మండలం గోపాల్‌పేట్‌లో ఉన్న దహన కేంద్రంలో గంజాయిని కాల్చివేసిట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. గంజాయిని దగ్ధం సమయంలో ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహీమ్‌ ఉన్నీషా బేగం ఉన్నారు. గంజాయిని ద`హనం చేయడానికి ప్రయత్నాలు చేసిన ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ అధికారులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Exit mobile version