నల్ల బెల్లాన్ని పట్టుకున్న ఎక్సైజ్, రైల్వే పోలీసులు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 24:
మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని ఎక్సైజ్, రైల్వే పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్, రైల్వే సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 కిలోల నల్లబెల్లంను గుర్తించారు. ఈ బెల్లాన్ని ఎవరు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు తెలియరాలేదని ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై, విక్రమ్ కుమార్, రైల్వే ఎస్సై, సుధాకర్, సిబ్బంది మైసరాజు, సంతోష్, ఆంజనేయులు, రాగ తదితరులు పాల్గొన్నారు.